విశ్రాంత హెచ్‌ఎం పద్మావతమ్మ దాతృత్వం

ABN , First Publish Date - 2021-10-26T07:37:45+05:30 IST

ఉద్యోగ విరమణ చేసి మూడు పదులు దాటిన ఒక విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు ఆ పాఠశాలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.

విశ్రాంత హెచ్‌ఎం పద్మావతమ్మ దాతృత్వం
విశ్రాంతి హెచ్‌ఎం పద్మావతమ్మతో ఉపాధ్యాయులు

విధులు నిర్వర్తించిన పాఠశాలకు రూ.2 లక్షల వితరణ 

పీలేరు, అక్టోబరు 25: ఉద్యోగ విరమణ చేసి మూడు పదులు దాటిన ఒక విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు ఆ పాఠశాలతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. రెండు దశాబ్దాలకు పైగా తాను సేవలు అందించిన పాఠశాల అభివృద్ధికి రూ.2లక్షలు వితరణగా అందజేసి అందరి చేత శభాష్‌ అనిపించుకున్నారు. పీలేరులోని జడ్పీ బాలికోన్నత పాఠశాలలో 30 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన ప్రధానోపాధ్యాయురాలు ఆర్‌.పద్మావతమ్మ సోమవారం పాఠశాలలు సందర్శిం చారు. రూ. 2లక్షల డిపాజిట్‌ పత్రాన్ని హెచ్‌ఎం జయమ్మకు అందజేశారు. దీనిపై వచ్చే వడ్డీ డబ్బుతో ప్రతి ఏటా పదో తరగతిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థినికి బంగారు పతకాన్ని అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా విశ్రాంత హెచ్‌ఎం పద్మావతమ్మను పాఠశాల హెచ్‌ఎం జయమ్మ, పలువురు ఉపాధ్యాయులు సన్మానించారు.

Updated Date - 2021-10-26T07:37:45+05:30 IST