రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-08-14T23:15:54+05:30 IST

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి కరోనా సోకింది. ఆయన శనివారం అనారోగ్యానికి గురయ్యారు.

రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy)కి కరోనా సోకింది. ఆయన శనివారం అనారోగ్యానికి గురయ్యారు. కోవిడ్ (Covid) లక్షణాలుగా అనుమానం రావడంతో నమూనాలను పరీక్షలకు పంపారు. పరీక్షలో ఆయనకు కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రేవంత్‌ సెల్ఫ్‌ క్వారంటైన్‌ (Self Quarantine)లో ఉన్నారు. కరోనా నిర్ధారణ కావడంతో తనను కలిసిన వారందరూ టెస్ట్ చేసుకోవాలని రేవంత్ సూచించారు. తనకు కరోనా సోకినట్లు ట్విటర్ ద్వారా ఆయన వెల్లడించారు. టెస్ట్ రిపోర్ట్‌ను ట్విటర్‌లో వెల్లడించారు. నిన్నటి నుంచి కరోనా లక్షణాలు బయటపడడంతో ఏఐసీసీ పిలుపు మేరకు ‘ఆజాదీకా గౌరవ్‌’ యాత్రలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో చేపట్టాల్సిన పాదయాత్రను ఆయన రద్దు చేసుకున్నారు. 


స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ‘ఆజాదీకా గౌరవ్‌’ యాత్రకు కాంగ్రెస్‌ పార్టీ శ్రీకారం చుట్టింది. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు ఆ పార్టీ నాయకులు జిల్లావ్యాప్తంగా చేపట్టనున్న పాదయాత్రకు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు. మొదటిరోజు ఈ నెల 9వ తేదీన పోచంపల్లి, బీబీనగర్‌ మండలాల్లో పర్యటించనున్నారు. 10న వలిగొండ, 11న ఆత్మకూరు, మూటకొండూరు, 12న ఆలేరు, యాదగిరిగుట్ట, 13న నారాయణపూర్‌, చౌటుప్పల్‌, 14న భువనగిరి మండలం, 15వ యాదగిరిగుట్ట, భువనగిరి పట్టణంలో జాతీయ జెండాలు ఆవిష్కరించారు. ఈ యాత్రలో స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుం టూ, స్వాతంత్య్ర ఉద్యమంలో, భారత దేశ నిర్మాణంలో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర, మహనీయుల త్యాగాలను వివరిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అమలుకాని హామీలపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు.

Updated Date - 2022-08-14T23:15:54+05:30 IST