కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-07-25T20:31:44+05:30 IST

సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో ఉప ఎన్నికలొస్తేనే

కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో ఉప ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. ఎక్కడ ఉప ఎన్నికలుంటే అక్కడే పథకాలు తెస్తారా?.. 118 నియోజక వర్గాల్లో ఉన్న దళితుల పరిస్థితి ఏంటి? అని రేవంత్ ప్రశ్నించారు. ఓట్ల కోసం దళితులను మోసం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబర్ 17వరకు దళిత గిరిజన దండోరా నిర్వహిస్తామని ప్రకటించారు. ఆగస్టు 9న ఇంద్రవెళ్లి గడ్డమీద లక్ష మందితో దండు కట్టి దండోరా నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. దళిత బంధు పథకం పేరిట సీఎం కేసీఆర్‌ చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు కార్యాచరణను టీపీసీసీ ప్రకటించింది. క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగిన ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 17 వరకు ‘దళిత దండోరా’ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది.

Updated Date - 2021-07-25T20:31:44+05:30 IST