ప్రతీకార దాడులు సరికాదు!

ABN , First Publish Date - 2021-10-27T08:25:06+05:30 IST

త్రిపురలోని వివిధ ప్రాంతాలలో మస్జీదులు, ముస్లింలు, వారి గృహాలపై జరుగుతున్న దాడుల పట్ల మేము ఆందోళన, ఆవేదన చెందుతున్నాం. ఇటీవల దుర్గాపూజ పండగ సందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందూ మతస్థులపైన...

ప్రతీకార దాడులు సరికాదు!

త్రిపురలోని వివిధ ప్రాంతాలలో మస్జీదులు, ముస్లింలు, వారి గృహాలపై జరుగుతున్న దాడుల పట్ల మేము ఆందోళన, ఆవేదన చెందుతున్నాం. ఇటీవల దుర్గాపూజ పండగ సందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందూ మతస్థులపైన, వారి పూజా వేదికలపైన జరిగిన దాడులకు ప్రతిగా త్రిపురలో ముస్లింలపై ప్రస్తుత దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. ‘ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించకుండా పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మైనారిటీ సెల్ బాధ్యులు ప్రతి చోటా అప్రమతమై ఉన్నారని’ త్రిపుర బీజేపీ అధికార ప్రతినిధి నవేందు భట్టాచార్య ప్రకటనను మేము స్వాగతిస్తున్నాం. నిరోధించడం ముఖ్యమే గానీ అదే సరిపోదు. ఆ దాడులను తీవ్రంగా ఖండించడం, ఆ హింసాకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడం చాలా ముఖ్యం.


త్రిపురలో ముస్లింలపై జరుగుతోన్న హింసాత్మక దాడులను ఖండించాలని ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ దాడుల్లో పాల్గొంటున్నవారిని గుర్తించి, తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని త్రిపుర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి చర్యల వల్ల త్రిపురలోనే కాక, దేశ వ్యాప్తంగా మతతత్వ హింసాకాండ పునరావృతం కాకుండా నిరోధించడం సాధ్యమవుతుంది. ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడులు చేస్తున్న వ్యక్తులను, వారిని ప్రోత్సహిస్తున్నవారిని గుర్తించి , కఠినచర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బంగ్లాదేశ్‌లో సంభవించిన దానికి ప్రతిగా త్రిపురలో సంబంధం లేనివారిపై దాడులు చేయడం అర్థరహితం.


ఆశా రమేశ్ (కర్ణాటక), క్రిస్టోఝపర్ ఫోన్సెక (గోవా), ఫాదర్ సెడ్రిక్ ప్రకాశ్ ప్రశాంత్ (గుజరాత్), హర్ష్ కపూర్ (న్యూఢిల్లీ), ఇర్ఫాన్ ఇంజినీర్ (మహారాష్ట్ర), డా. మజ్హెర్ హుస్సేన్ (ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, కోవా, హైదరాబాద్‌), పి.వి.రాజగోపాల్ (సర్వోదయ సమాజ్), రామ్ పునియాని (ఆల్ ఇండియా సెక్యులర్ ఫోరం), సత్యపాల్ (సౌత్ ఏసియన్ ఫ్రెటర్నిటీ), సందీప్ పాండే (ఉత్తరప్రదేశ్).

Updated Date - 2021-10-27T08:25:06+05:30 IST