రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే కాకాణి

ABN , First Publish Date - 2021-07-24T05:18:32+05:30 IST

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు.

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే కాకాణి
అర్జీదారులు సమస్యల వింటున్న ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి


తోటపల్లిగూడూరు, జూలై 23 : రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు   ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన రెవెన్యూ పరమైన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న చుక్కల భూముల సమస్యలతోపాటు, రికార్డుల్లో అవసరమైన మార్పులు, చేర్పులు, పట్టాదారు పాసుపుస్తకాలు అందించే ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జడ్పీ చైర్మన్‌గా 15ఏళ్ల  క్రితం ఇదేరోజు జూలై 23, 2006లో ప్రారంభమైన నా రాజకీయ ప్రస్థానం ప్రజాసేవలో కొనసాగించేందుకు సహకరించి వెన్నుతట్టి ప్రోత్సహించిన ప్రజానీకానికి, నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.


కాకాణికి ఘన సన్మానం

జడ్పీ చైర్మన్‌గా 15ఏళ్ల క్రితం ఇదే రోజున బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్‌రెడ్డికి వైసీపీ కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో నాయకుడు గూడూరు విష్ణుకుమార్‌రెడ్డి, కార్యకర్తలు గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చిల్లకూరు సుధీర్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్‌ మన్నెం సుబ్రహ్మణ్యంగౌడ్‌, మాజీ జడ్పీటీసీ చిరంజీవిగౌడ్‌, తలమంచి సురేంద్రబాబు, ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, ఎంపీడీవో కన్నం హేమలత, తహసీల్దారు శ్యామలమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-24T05:18:32+05:30 IST