తరగతి గదిలో పాఠాలు వింటున్న విద్యార్థులు
స్కూళ్లు మొదలు.. ఫీజుల గుబులు
ఒత్తిడి పెంచుతున్న యాజమాన్యాలు
ఏడాది మొత్తానికి చెల్లించాలంటున్న వైనం
ఆందోళనకు గురవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
మహబూబ్నగర్ విద్యావిభాగం, ఫిబ్రవరి 25: స్కూళ్ల ప్రారంభానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో లేదో అప్పుడే ఫీజుల దోపిడీ మొదలైంది. ప్రై వేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తరగతుల నిర్వహణకంటే ఫీజుల వసూలు పైనే ప్రత్యేక దృష్టి సారించాయి. ఆలస్యంగా తరగతులు ప్రారంభమైనామొత్తం ఏడాది ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై యాజమాన్యాలు ఒత్తిడి పెంచుతున్నాయి. పాఠశాలలే కాకుండా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాల్లో కూడా ఇదే పరిస్థితి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ అధికారులు మాత్రం నోరుమెపదడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని వైనం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1205పైగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఇందులో తొమ్మిది, పది, ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు 94,564 మంది ఉన్నారు. పాఠశాలలు నిర్వహించని కాలానికి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయవద్దని సూచించినా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. నిబంధ నలకు వ్యతిరేకంగా ఫీజు వసులు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్ట నట్టుగా వ్వవహరిస్తునారన్న ఆరపణలు ఉన్నాయి పాలమూరు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం రెండో తరగతి చదివే విద్యార్థికి రూ.74,500 ఫీజు చెల్లించాలని ఒత్తిడి తెచ్చినట్టు సదరు విద్యార్థి తల్లి ఆంధ్రజ్యోతికి తెలిపింది. అలాగే జిల్లా కేంద్రంలోనే మెట్టుగడ్డలోగల ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి రూ.38, 650 చెల్లించాలంటున్నారని విద్యార్థి తండ్రి వాపో వడం గమనార్హం. అయితే అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని, ప్రభుత్వ సూచించిన విదంగా ఫీజులు వసులు చేయాలని డీఐఈవో వెంకటేశ్వర్లు చెబుతున్నారు. ఏదేమైనా విద్యాశాఖ అఽధికారులు స్పందించి ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలపై ఫీజుల దోపిడీని అరికట్టా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.