మూసీ ఆక్రమణలపై సర్వే

Published: Wed, 26 Jan 2022 08:46:38 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మూసీ ఆక్రమణలపై సర్వే

అభ్యంతరాల స్వీకరణకు 15 రోజుల గడువు 

హైదరాబాద్‌ సిటీ/మదీన/లంగర్‌హౌస్‌: మూసీ సుందరీకరణ వైపు అడుగులు పడుతున్నాయి. మూసీ నది బెడ్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న ఆక్రమణలను గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్‌, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లు కలిపి సర్వే నిర్వహించనున్నాయి. మూసీనది హైదరాబాద్‌ డివిజన్‌లో 14.2 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. నది ఒడ్డు, బఫర్‌ జోన్‌లను గుర్తించేందుకు తహసీల్దార్‌ కార్యాలయంలోని పాత మ్యాపులను వినియోగించనున్నారు. డీజీపీఎస్‌ టెక్నాలజీ సాయంతో గతంలోని నదీ పరీవాహక ప్రవాహక ప్రాంతం, బఫర్‌ జోన్‌లను గుర్తిస్తారు. హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని గోల్కొండ, ఆసి్‌ఫనగర్‌, బహదూర్‌పురా, చార్మినార్‌, నాంపల్లి, హిమాయత్‌నగర్‌, సైదాబాద్‌, అంబర్‌పేట్‌ రెవెన్యూ కార్యాలయాల్లోని మ్యాపుల ఆధారంగా సర్వే ఉంటుందని అధికారులు తెలిపారు. సర్వేపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా గాంధీ భవన్‌కు ఎదురుగా ఉన్న ఆర్‌డీఓ డివిజన్‌ కార్యాలయం రెండో అంతస్తులో సంప్రదించాలని అధికారులు కోరారు. బహదూర్‌పురాలోని మూసీ సుందరీకరణ పనులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు తహసీల్దార్‌ ఎస్‌.రాములు పేర్కొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.