అమలు దిశగా రెవెన్యూ

ABN , First Publish Date - 2020-09-25T06:45:32+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ ల తీసుకొచ్చిన రెవెన్యూ చట్టా న్ని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. పారదర్శకతతో కూడిన సులభతర

అమలు దిశగా రెవెన్యూ

రెవెన్యూ చట్టాన్ని అమలు చేసే దిశగా యంత్రాంగం కసరత్తు

తహసీల్‌ కార్యాలయాల్లో వసతులపై ఆరా  ఆన్‌లైన్‌లో ఉద్యోగుల వివరాల నమోదు

ఇప్పటికే సర్కారుకు చేరిన వీఆర్వో, వీఆర్‌ఏల సర్వీస్‌ వివరాలు 

జిల్లావ్యాప్తంగా 250 మందికి పైగా డాక్యుమెంట్‌ రైటర్లు


కామారెడ్డి, సెప్టెంబరు 24: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ ల తీసుకొచ్చిన రెవెన్యూ చట్టా న్ని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. పారదర్శకతతో కూడిన సులభతర సేవలను వేగంగా అందించడమే లక్ష్యంగా నూతన రెవె న్యూ చట్టం రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. దీని అమలులో భాగంగా జిల్లాలోని తహసీల్‌ కార్యాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ సేవలం దించేందుకు కావాల్సిన ఏర్పాట్లలో జిల్లాయంత్రాంగం నిమగ్నమైం ది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్‌ కార్యాలయాల్లో చే పట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తదనుగుణంగా అడు గులు పడుతున్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన మార్గదర్శకాలు ప్ర భుత్వం నుంచి సమాచారం వెలువడనప్పటికీ తొలుత మండల స్థాయిలో సబ్‌ రిజిస్ట్రార్‌ వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించారు.


త్వరలో స్పష్టత

జిల్లావ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్‌ రైటర్ల సంఖ్యపై యంత్రాం గం ఆరా తీస్తోంది. జిల్లాలో 5 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉం డగా, వీటి పరిధిలో 250 మంది డాక్యుమెంట్‌ రైటర్లు ఉన్నట్లు స మాచారం. ఇప్పటివరకు వీళ్లంతా లైసెన్సులు లేకుండా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. మండలస్థాయిలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ పనులు సాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ తహ సీల్‌ కార్యాలయం వద్ద ఒకరు లేదా ఇద్దరు డాక్యుమెంట్‌ రైటర్లను నియమించే వీలుంది. ఇందుకోసం రాతపరీక్షల, విద్యార్హత, అనుభవం విషయాలను పరిగ ణలోకి తీసుకునే వీలుంది. త్వరలో స్పష్టత రావచ్చు. 


వివరాలపై ఆరా

తహసీల్‌ కార్యాలయాల్లో సిబ్బంది, ఫర్నిచర్‌, కంప్యూటర్‌ సామ గ్రి వివరాలను జిల్లా అఽధికారుల నుంచి సీసీఎల్‌ఏ సేకరిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతమున్న వసతులకు అదనంగా ప్రధానంగా ప్రింటర్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్‌ అవసరమయ్యేలా ఉ న్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ వ్యవస్థపై తహసీల్దార్లకు గతంలో శిక్షణ ఇ చ్చారు. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో మరోసారి తర్ఫిదు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు తరచూ నివే దిక కోరుతుం డడంతో జిల్లా రెవెన్యూ విభాగం అధికారులు ఆ పని లో నిమగ్నమయ్యారు. జిల్లాలో 22 మండలాలు ఉండగా వీట న్నింటిలో సబ్‌రిజిస్ట్రార్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.


సమాచారం సిద్ధం

వీఆర్వోల వ్యవస్థను ప్రభుత్వం రద్దుచేసిన నేపథ్యంలో జిల్లా వ్యా ప్తంగా ఉన్న 307 మంది వీఆర్‌వోలను ఇతరశాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. ఇందుకోసం వారి సర్వీసు, ఇతర వివరాలను అధి కారులు సేకరించారు. వీఆర్‌ఏల సర్వీసు క్ర మబద్ధీకరణ నేప థ్యంలో వారి విద్యా ర్హతలతో పాటు ప ని తీరు పై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. డిప్యూటీ త హసీల్దార్లు, ఆర్‌ఐ సర్వీ స్‌ వివరాలతో పాటు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్‌ సర్వీసు వివరాలను క్రోడిక రించి ఆన్‌లైన్‌లో నమో దు చేసే పనిలో ఉన్నార ని సమాచారం. వీటిని ఉన్నతాధికారులకు పంపనున్నారు.

Updated Date - 2020-09-25T06:45:32+05:30 IST