కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టండి

ABN , First Publish Date - 2022-09-27T04:56:29+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు పి.మధు పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళంలో డైమండ్‌పార్క్‌ వద్ద ‘దేశ రక్షణ భేరి’ నిర్వహించారు. నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆదానీ, అంబానీ తదితర కార్పొరేటర్లకు ఊడిగం చేస్తూ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారం మోపుతోందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టండి
ర్యాలీలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర నాయకుడు మధు, కార్యకర్తలు

సీపీఎం రాష్ట్ర నాయకుడు మధు   
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 26 :
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు పి.మధు పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళంలో  డైమండ్‌పార్క్‌ వద్ద ‘దేశ రక్షణ భేరి’ నిర్వహించారు. నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన  కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆదానీ, అంబానీ తదితర కార్పొరేటర్లకు ఊడిగం చేస్తూ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారం మోపుతోందని విమర్శించారు. ‘ప్రత్యేకహోదా, విభజన హామీల అమలులో రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ ఉద్యమిద్దాం. దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దేశభక్తి ముసుగులో ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకొంటున్న బీజేపీ కుట్రలను, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం. మోదీ పాలనంలో దేశం అథోగతి పాలైంది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. పెట్రో, డీజిల్‌ రూపంలో ప్రజలపై రూ.27 లక్షల కోట్ల భారం మోపారు. రైల్వే, బ్యాంకులు, ఎల్‌ఐసీని ప్రైవేటీకరించేస్తున్నారు. బడా కార్పొరేటర్లకు రుణమాఫీ చేస్తున్నారు. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను దెబ్బ తీశారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు అని ఉత్తుత్తి ప్రకటన చేశారు. కొవ్వాడలో అణుపార్కు ఏర్పాటు చేస్తామంటే.. శ్రీకాకుళం జిల్లాలో అణుబాంబు పెట్టడమే. ఏ చిన్న ప్రమాదం వాటిల్లినా జిల్లా సర్వనాశనమవుతుంద’ని మధు తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రతినిధులు గోవిందరావు, బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు, టి.తిరుపతిరావు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-27T04:56:29+05:30 IST