దరఖాస్తులను మరోసారి పరిశీలించండి

ABN , First Publish Date - 2021-01-22T05:39:46+05:30 IST

ప్రభుత్వ పథకాలు కోరుతూ వచ్చిన దరఖాస్తుల్లో 12వేలు తిరష్కరణకు గురయ్యాయని, వాటిని మరోసారి పరిశీలించాలని కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌ అధికారు లను ఆదేశించారు

దరఖాస్తులను మరోసారి పరిశీలించండి

విజయనగరం (ఆంధ్ర జ్యోతి) జనవరి 21 : ప్రభుత్వ పథకాలు కోరుతూ వచ్చిన దరఖాస్తుల్లో 12వేలు తిరష్కరణకు గురయ్యాయని, వాటిని మరోసారి పరిశీలించాలని కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌ అధికారు లను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశమందిరంలో చేయూత, జగనన్న తోడు, వైఎస్‌ఆర్‌ బీమా పథకాలపై బ్యాంకర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, డీఆర్‌డీఏ అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. జగనన్న తోడు పథకం  పేద చిరువ్యాపారులకు ఆసరాగా ఉంటుందని, పెండింగ్‌ దరఖాస్తులను మరోసారి పరిశీలించాలన్నారు. తిరష్కరించిన అర్జీలను మూడు రోజుల్లో పరిష్కరించాలని చెప్పారు. బ్యాంకర్లు చిత్తశుద్ధితో పనిచేసి యూనిట్లను మంజూరుచెయ్యాలని బ్యాంక్‌ ప్రతినిధులను అదేశించారు. సమావేంలో జేసీ మహేష్‌కుమార్‌, డీఆర్‌డీఏ పీడీ కె.సుబ్బారావు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ కె.శ్రీనివాసరావు, జడ్పీ సీఈవో టి.వెంకటేశ్వరావు, డీపీవో సునీల్‌ రాజ్‌కుమార్‌, పశుసంవర్ధక శాఖ జేడీ నరశింహులు, మెప్మాపీడీ సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు. 

మత్స్య ఉత్పత్తులకు మార్కెట్‌ సదుపాయం

కలెక్టరేట్‌: జిల్లాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా అందజేస్తున్న యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ సూచించారు. తన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద జిల్లాకు మంజూరైన రూ.4.53 కోట్లతో చేపట్టాల్సి పనులపై చర్చించారు. ఆయా యూనిట్ల ఏర్పాటు కోసం రూ 3.90 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మత్య్స శాఖ డీడీ నిర్మలా కుమారి, జడ్పీ సీఈవో టి.వెంకటేశ్వరరావు, మత్య్స శాఖ అభివృద్ధి అధికారి కిరణ్‌, ఎల్‌డీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T05:39:46+05:30 IST