విప్లవోద్యమ సాంస్కృతిక సేనాని...

Published: Tue, 22 Mar 2022 02:25:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విప్లవోద్యమ సాంస్కృతిక సేనాని...

హిందుత్వ బాహ్య ఎత్తుగడ మతోన్మాదంగా చలామణి అవుతే దాని అంతర్గత వ్యూహం నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ. కులోన్మాదం పునాదిగా మతోన్మాదపు రాజకీయ ఎత్తుగడ చలామణి అయ్యే అంశాన్ని గమనించాల్సిందే. ఫాసిజాన్ని రెండు రూపాల్లో అనగా భూస్వామ్య సమాజ పునాదిగా అలాగే పెట్టుబడీదారీ పెటీ బూర్జువా రాజకీయంగా చూడాలని గ్రాంసీ విశ్లేషించారు. భారతదేశ సామాజిక సంబంధాలను గమనిస్తే గ్రాంసీ నిర్వచనం వాస్తవిక ప్రతిఫలనం అవగాహన అవుతుంది. ఇక్కడ ఒకపక్క కుల సంబంధాల పునాది కలిగిన భూస్వామ్యం, మరొక ప్రక్క పెట్టుబడీదారీ వ్యవస్థ  ప్రత్యేకత (బ్యూరాక్రటిక్ పెట్టుబడి) సమాంతరంగా చలామణి అవుతున్న స్థితిలో రాజకీయ వాతావరణం ఒక విరోధాబాసగా ఉన్న నేపథ్యాన్ని గమనించాలి. ఇదంతా హిందుత్వ ఫాసిస్టు రాజకీయ క్షేత్రంగా పరిణమించిన కాలంలోనే భారత్‌లో దోపిడీ రహిత నూతన సామాజిక సంబంధాల ప్రజాస్వామ్యాన్ని రమేష్ ఆకాంక్షించాడు. విప్లవోద్యమానికి-, దళిత సమస్య పరిష్కారానికి ఆయన జూలకల్లులో సజీవ సాక్ష్యమై ఉన్నాడు. దళితులు బడుగూ బలహీనులు విప్లవోద్యమంతో లేరని అది అగ్రవర్ణ- అగ్రకులాల అహంకారంతో సాగే కార్యాచరణగా వాదించే మేధావులకు ప్రశ్నగానే రమేష్ చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఆయన కేవలం డప్పు వాయించి విప్లవ పాటలు పాడుతూ డప్పు రమేష్‌గా రూపాంతరం చెందలేదు, ఆయన ‘డప్పు శాస్త్రం’ అనే పుస్తకాన్ని సైతం రచించి దాని శాస్త్రీయతను వ్యక్తం చేయడం జరిగింది. ఈ ‘డప్పు శాస్త్రం’ పుస్తకంలో డప్పును వాయించే విధానంలోనే కొత్త పద్ధతులను కనుక్కుని అందరికి పరిచయం చేయడం ఒక విశేషం.


రమేష్ పాటల జీవితాన్ని మూడు పార్శ్వాలల్లో చూడాలి 1. జననాట్య మండలి కార్యకర్తగా, 2. సాంస్కృతిక గెరిల్లా యోధుడిగా, 3. విభిన్న అస్తిత్వ పోరాటాల పక్షపాతిగా. రమేష్ పాటలను మనం సామాజిక ఆచరణలో– సాధారణ, ప్రత్యేక సామాజికీకరణగా విభజించి ప్రస్తావించవచ్చు. భౌతిక పరిస్థితుల సాధారణ ప్రతిఫలనం నుండే విప్లవోద్యమాన్ని పాటగా మలిచాడు, అలాగే ప్రత్యేక సామాజిక రూపాన్ని సైతం పాటగా ప్రతిబింబించాడు. మరింత లోతుల్లోకి వెళితే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి సామాజికం, హోదా వ్యక్తిగత రూపంగా చెప్పుకోవాలి. అందుకే కమ్యూనిస్టులు ఈ వ్యక్తిగత హోదా రూపాన్ని రద్దు చేయడమే కర్తవ్యంగా భావిస్తారు. ఈ భౌతిక నేపథ్యం ఉన్నంత వరకూ సామాజిక మరియూ వ్యక్తిగత రూపాలు వాటి చైతన్య ప్రతిఫలాలు సాహిత్యంలో (పాటల్లో) సైతం ఉద్భవిస్తాయి కూడా. కావున విప్లవ సాహిత్యం ఖచ్చితంగా, అనివార్యంగా సామాజిక అంశానికి ప్రాధాన్యం ఇస్తూ వ్యక్తిగత హోదాను రద్దు చేసే సాహిత్య కృషిని నిర్వహించాలి. అందుకు సంకల్పించి బాధ్యతగా సాగడాన్ని రమేష్ కర్తవ్యంగా పెట్టుకున్నాడు. అందుకే రమేష్ విప్లవోద్యమ సాంస్కృతిక సేనానిగా బతికాడు. ప్రజల స్మృతుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు.

బండి కిరణ్

అంబేడ్కర్ ఫూలే యువజన సంఘం

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.