మహిళా కౌన్సిలర్ల గైర్హాజరుపై రభస

ABN , First Publish Date - 2021-06-20T04:36:02+05:30 IST

వనపర్తి మునిసిపాలిటీ వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

మహిళా కౌన్సిలర్ల గైర్హాజరుపై రభస
మునిసిపల్‌ కార్యాలయంలో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ రాధాకృష్ణతో వాగ్వాదానికి దిగుతున్న కౌన్సిలర్ల భర్తలు

- మునిసిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ డైరెక్టర్‌కు కాంగ్రెస్‌ నాయకుల ఫిర్యాదు

- ఇంటికి వెళ్లి కౌన్సిల్‌లో సంతకాలు తీసుకుంటున్నారని ఆరోపణ

- కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌పై దాడికి ప్రయత్నించిన కౌన్సిలర్ల భర్తలు

వనపర్తి టౌన్‌, జూన్‌ 19: వనపర్తి మునిసిపాలిటీ వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాలకవర్గంలో అంతర్గత కుమ్ములాటలు, వర్గాలుగా విడిపో యిన కౌన్సిలర్లు, అధికారులపై ఫిర్యాదులు ఓ వైపు నడుస్తుండగానే.. తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఈనెల 16న డైరెక్టర్‌ ఆఫ్‌ మునిసిపల్‌ అ డ్మినిస్ర్టేషన్‌ సత్యనారాయణ వనపర్తి వచ్చి కలెక్టరేట్‌లో మునిసిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు, హరితహారం, నర్సరీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది కౌన్సిలర్లు అభివృద్ధి కార్యక్రమాల మంజూరు, అధికారుల కొరతపై వినతిపత్రాలు సమర్పించారు. కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ బండారు రాధాకృష్ణ హ రితహారంలో అవకతవకలు, జనరల్‌ ఫండ్స్‌ను మహిళా సంఘాల పేరుతో చె క్కుల డ్రా చేయడం, కొంత మంది కౌన్సిలర్లు నెలలతరబడి మీటింగ్‌లకు హాజ రు కాకపోవడంపై డీఎంఏకు ఫిర్యాదు చేశారు. హాజరు కాని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కౌన్సిల్‌కు హాజరుకాని వారి ఇళ్లకు వెళ్లి సంతకాలు తీసు కోవడం సరికాదని అన్నారు. అయితే, ఈ ఫిర్యాదుపై ఆగ్రహం చెందిన కొందరు మహిళా కౌన్సిలర్ల భర్తలు మునిసిపాలిటీ కార్యాలయంలో బండారు రాధాకృష్ణ ఉన్న సమయంలో వెళ్లి వాగ్వాదానికి దిగి పరుష పదజాలంతో తిట్టారు.  ఇదం తా మునిసిపల్‌ మేనేజర్‌ సమక్షంలో జరిగినా అధికారులు వారించే ప్రయత్నం చేయలేదు. ఒక పార్టీ ఫ్లోర్‌ లీడర్‌పై కొందరు మహిళా కౌన్సిలర్ల భర్తలు    దాడికి పూనుకోవడం మునిసిపల్‌ పాలకవర్గ కలహాలను మరోసారి చర్చలోకి తెచ్చింది.

దాడికి ప్రయత్నించారు..

కాంగ్రెస్‌పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ను.. రాష్ట్ర అధికారి వస్తే మునిసిపాలిటీలోని అభివృద్ధిపై, సమస్యలపైనా, అక్రమాలపైనా ఫిర్యాదు చేసే బాధ్యత ఉంది. నేను అలాగే ఫిర్యాదు చేశాను. వారు కూడా ఆ అధికారి ద్వారానే వివరణ తీసుకుంటే బాగుండేది. కానీ, నేను మునిసిపల్‌ కార్యాలయంలో ఉన్నది చూ సి నాపై పరుష పదజాలంతో దాడికి ప్రయత్నించడం సరికాదు. అందరూ ఖచ్చితంగా మునిసిపల్‌ నిబంధనలు పాటించాల్సిందే

- బండారు రాధాకృష్ణ, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌

Updated Date - 2021-06-20T04:36:02+05:30 IST