Viral Video: ఖడ్గమృగంతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. సింహాలను తరిమి తరిమి కొట్టిందిగా..

ABN , First Publish Date - 2022-03-12T01:40:55+05:30 IST

జంతువుల మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుండడం కొత్తేం కాదు. పులులు, సింహాల వేట..

Viral Video: ఖడ్గమృగంతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. సింహాలను తరిమి తరిమి కొట్టిందిగా..

జంతువుల మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతుండడం కొత్తేం కాదు. పులులు, సింహాల వేట గురించి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి పంజా విసిరాయంటే.. అవతల ఎలాంటి జంతువైనా నేలకొరగాల్సిందే. కానీ, కొన్నిసార్లు మాత్రం సింహాలకూ చుక్కలు చూపించే జంతువులు తారసపడుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో అలాంటిందే. ఖడ్గమృగం మీద దాడి చేసేందుకు వెళ్లిన సింహాలకు చివరకు చుక్కలు కనపడ్డాయి..


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతోన్న ఒక వీడియోలో ఓ ఖడ్గమృగం నీటి కుంట వద్ద సేదతీరుతూ ఉంటుంది. ఆ సమయంలో కొన్ని సింహాలు దూరం నుంచి దాన్ని గమనిస్తుంటాయి. అదును చూసి ఒక్కసారిగా దాని మీదకు దూకేస్తాయి. ఊహించని పరిణామానికి ఉలిక్కిపడ్డ ఖడ్గమృగం.. కాసేపు తడబడుతుంది. ఓ సింహం దాని మీదకు దూకి కిందపడేయాలని ప్రయత్నిస్తుంది. అయితే ఖడ్గమృగం మాత్రం అలాగే కాస్త ముందుకు వెళ్లి, దాన్ని గట్టిగా విదిలిస్తుంది. తర్వాత మరికొంత దూరం ముందుకు వెళ్లి తిరిగి సింహాల మీదకు దూసుకొస్తుంది. ఒక్కసారిగా మూడు సింహాలు చుట్టుముట్టినా భయపడకుండా.. ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఖడ్గమృగం దగ్గరికి వెళ్లేందుకు కూడా సింహాలు భయపడతాయి. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న సందర్శకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. సింహాలకు బాగానే బుద్ధి చెప్పిందంటూ చమత్కరిస్తున్నారు.

మనుషులతో పోటీ పడి పుషప్స్ తీస్తున్న ఎలుగుబంటి.. అవాక్కవుతున్న నెటిజన్లు..



Updated Date - 2022-03-12T01:40:55+05:30 IST