ఏడాది తర్వాత రియా సంచలన వ్యాఖ్యలు!

Jun 8 2021 @ 01:00AM

గత ఏడాది జూన్‌ 14న మరణించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆయన మరణంతో బీ–టౌన్‌లో డ్రగ్‌ వ్యవహరం తెరపైకి వచ్చింది. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తికి డ్రగ్‌ పెడ్లర్స్‌తో సంబంధం ఉందని నిర్థారణ కావడంతో ప్రధాన నిందితురాలిగా ఆమెపై ఎన్‌సీబీ కేసు నమోదు చేసి జైలుకి తరలించారు. ఏడాదిగా ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ ముందుకు సాగుతూనే ఉంది. కొద్దిరోజులకు బెయిల్‌ బయటకు వచ్చిన ఆమె కొద్ది రోజులు మౌనం వహించింది. ఇటీవల ఎన్‌సీబీ విచారణలో రియా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సుశాంత్‌ సోదరి ప్రియాంక, ఆమె భర్త కూడా డ్రగ్స్‌ వాడేవారని తెలిపింది. సుశాంత్‌ డ్రగ్స్‌ వాడతారని ఇంట్లో వాళ్లకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే  కాకుండా సుశాంత్‌ చనిపోవడానికకి నాలుగు రోజుల ముందు సుశాంత్‌ సోదరి ప్రియాంక డ్రగ్స్‌ కోసం మెేసజ్‌ చేసిందని, తనకు 10 గ్రాముల లిబ్రియం, నెక్సిటో కావాలంటూ చాట్‌ చేసిందని చెప్పింది. నటి సారా అలీఖాన్‌ కూడా ఇందులో భాగమేనని వెల్లడించింది. ఆమెతో కలిసి గంజాయి పిల్చానని, చాలాసార్లు సారా అలీఖాన్‌ తనకు గంజాయితోపాటు వోడ్కాను ఆఫర్‌ చేసినట్లు రియా తన వాంగ్మూలంలో  పేర్కొంది. ఈ నెల 12న సుశాంత్‌ తొలి వర్థంతి వస్తున్న నేపథ్యంలో రియా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. 




Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.