శ్రీలంకలో కేజీ బియ్యం ధర 220.. ఒక గుడ్డు రూ.30

ABN , First Publish Date - 2022-04-03T19:47:05+05:30 IST

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆహార పదార్థాలు, మందుల ధరలు చూసి శ్రీలంక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

శ్రీలంకలో కేజీ బియ్యం ధర 220.. ఒక గుడ్డు రూ.30

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆహార పదార్థాలు, మందుల ధరలు చూసి శ్రీలంక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాజధాని కొలంబోలో కేజీ బియ్యం ధర మన కరెన్సీలో రూ.220కాగా, గోధుమల ధర రూ.190కి చేరింది. చక్కెర కేజీ రూ.240, కొబ్బరి నూనె లీటరు ధర రూ.850, ఒక కోడిగుడ్డు రూ.30, కేజీ మిల్క్ పౌడర్ ధర రూ.1,900గా ఉంది. ఆర్థిక మాంద్యం, శ్రీలంక కరెన్సీ క్షీణత వల్ల దేశంలో ధరల పెరుగుదల సంభవించింది. ఒకవేళ ధర చెల్లించి కొనుక్కుందామన్నా కొన్ని చోట్ల సరుకులు దొరకని పరిస్థితి నెలకొంది. చాలామంది షాపులు, సూపర్ మార్కెట్ల ముందు బారులు తీరి, చివరకు సరుకులు అయిపోయి ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్న దృశ్యాలు చాలా కనిపిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. సోమవారం ఉదయం వరకు కర్ఫ్యూ విధించారు. నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు మాత్రమే పరిమితంగా ప్రజల్ని అనుమతిస్తున్నారు.

Updated Date - 2022-04-03T19:47:05+05:30 IST