ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T05:53:39+05:30 IST

గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.

ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ఆదోని రూరల్‌, జూలై 24: గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. బైచిగేరిలో వెలసిన సాయిబాబా దేవాలయంలో శనివారం భక్తులు పూజలు చేపట్టారు. మహిళలు దేవాలయం ముందు పేడ చల్లి, ముగ్గులు వేశారు. సాయిబాబాకు ఇష్టమైన బన్నులు, బిస్కెట్లు సమర్పించి పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 


 ఆరెకటికల గురువు ధర్మవ్యాధుడు అడుగు జాడల్లో నడవాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు శివాజీ రాజా, పట్టణ అధ్యక్షుడు సుధీర్‌ అన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా శనివారం ఎమ్మిగనూరు బైపాస్‌లోని 41 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కుల గురువు ధర్మవ్యాధుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. గణేష్‌, రాజేష్‌, భాస్కర్‌, సత్యం, రాజగోపాల్‌, జీవన్‌, రఘు, శేఖర్‌ పాల్గొన్నారు.


ఎమ్మిగనూరు టౌన్‌: గురుపౌర్ణమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని బనవాసి ఫారం, పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో ఆవరణలోని దత్తసాయి, తిరుమల నగర్‌లో వెలసిన వెంకటసాయి. టీబీపీ కాలనీలోని సాయిబాబా, వీవర్స్‌కాలనీ సాయిబాబా దేవాలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పూజలు నిర్వహించి కానుకలు సమర్పించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి వెంటసాయి దేవాల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


మంత్రాలయం: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో శనివారం గురుపౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుసీవనంలో మృత్తిక సంగ్రహణ మహోత్సవ వేడుకను కనులపండువగా నిర్వహించారు. మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు తులసీవనంలో తులసీ మొక్కలకు ప్రత్యేక పూజలు చేసి మృత్తికను సేకరించారు. అనంతరం స్వర్ణ పల్లకిలో మృత్తికను ఉంచి మఠం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం మృత్తికను స్వామి బృందావనం వద్ద ఉంచి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామి బృందావనానికి నిర్మల్య విసర్జన, సుప్రభాతసేవ, విశేష పంచామృతాభిషేకం పూజలు చేసి స్వర్ణ కవచాలు, పట్టువస్ర్తాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. రాత్రి ప్రహ్లాదరాయల ఉత్సవాల్లో స్వామి అలంకరించి ఆయా రథాలపై అధిష్టించి ఆలయ ప్రాంగణం చుట్టూ అశేష భక్తుల నడుమ ఊరేగించారు. 

Updated Date - 2021-07-25T05:53:39+05:30 IST