తమన్‌ చేతుల మీదుగా.. ‘రిచి గాడి పెళ్లి’

Sep 24 2021 @ 21:24PM

నవీన్‌ నేని, ప్రణీత పట్నాయక్‌ కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రిచి గాడి పెళ్లి’. కె.ఎస్‌.హేమరాజ్‌ దర్శకత్వంలో కె.ఎస్‌ ఫిల్మ్‌వర్క్‌ సంస్త నిర్మించిన చిత్రమిది. అనంత్‌ శ్రీరామ్‌ రాసిన ‘ఏమిటిది మతి లేదా ప్రాణమా’ పాటను తమన్‌ విడుదల చేశారు.  సినిమా సక్సెస్‌ కావాలని ఆయన అభిలాషించారు. గేయ రచయిత అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘వేదాంతాన్ని బోధించే పాట ఇది’’ అన్నారు. మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ ఇదని దర్శకుడు తెలిపారు.  


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.