ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధన
ABN , First Publish Date - 2022-01-29T05:33:40+05:30 IST
త్యాగరాజుస్వామి ఆరాధన మహోత్సవ వేడుకలను నాయీబ్రాహ్మణ సేవా సం ఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
పామూరు, జనవరి 28: త్యాగరాజుస్వామి ఆరాధన మహోత్సవ వేడుకలను నాయీబ్రాహ్మణ సేవా సం ఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా త్యాగరాజుస్వామి చిత్ర పటాన్ని ప్రత్యేక వాహనం పై అలంకరించి మేళతాళాలతో, మంగళవాయిద్యాలతో స్థానిక సత్యదేవుని దేవస్ధానం నుంచి వేణుగోపాలస్వామి దేవస్థానం వరకు గ్రామోత్సవం నిర్వ హించారు. అనంతరం పలువురు కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాగిపాటి సుధాకర్, పసుపులేటి వెంకటనారాయణ, రాగిపాటి కిష్టయ్యతో పాటు మండల కార్యవర్గ సభ్యులు డి మస్తాన్, ఎన్ మల్లికార్జున, జి శరత్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.