Rifle Shootingలో సత్తా చాటిన తెలుగు తేజం

ABN , First Publish Date - 2022-05-14T03:08:13+05:30 IST

జర్మనీలో జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ (Rifle Team) ఈవెంట్‌లో విజయవాడకు చెందిన

Rifle Shootingలో సత్తా చాటిన తెలుగు తేజం

విజయవాడ: జర్మనీలో జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ (Rifle Team) ఈవెంట్‌లో విజయవాడకు చెందిన మద్దినేని ఉమామహేష్‌ స్వర్ణంతో సత్తా చాటాడు. శుక్రవారం నాటి ఫైనల్స్‌లో స్పెయిన్‌పై భారత్‌ టీమ్‌ 16-8 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణం కైవశం చేసుకుంది. ముగ్గురిలో ఎక్కువ స్కోర్‌ చేసిన ఉమామహేష్‌ భారత్‌కు స్వర్ణ పతకం అందించాడు. ఉమామహేష్‌(ఆంధ్రా), రుద్రాక్ష పాటిల్‌(మహరాష్ట్ర), ఎం. పార్థ(ఢిల్లీ) త్రయంలు భారత్‌ జెండాను రెపరెపలాడించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతర్జాతీయ స్ధాయిలో సత్తా చాటి బంగారు పతకం సాధించిన మొదటి వ్యక్తి ఉమామహేష్‌ కావడం గమనార్హం. గతంలో యూనివర్శిటీ గేమ్స్‌లో బంగారు పతకం ఉమామహేష్‌ సాధించాడు. కేఎల్‌ యూనివర్శిటిలో ఇంజనీరింగ్‌(ఐటీ) మొదటి సంవత్సరం చదువుతున్న ఉమా మహేష్‌ విజయవాడలోని ది ఇండియన్‌ స్పోర్ట్సు ఆప్‌ షూటింగ్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. 

Read more