Training: రైఫిల్‌ షూటింగ్‌లో విద్యార్థినులకు శిక్షణ

ABN , First Publish Date - 2022-09-09T16:01:44+05:30 IST

కోయంబత్తూర్‌(Coimbatore) జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యం లో విద్యార్థినులకు రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణ ఇస్తున్నారు. పాఠశాల విద్యార్థినులకు భద్రతపై

Training: రైఫిల్‌ షూటింగ్‌లో విద్యార్థినులకు శిక్షణ

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 8: కోయంబత్తూర్‌(Coimbatore) జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యం లో విద్యార్థినులకు రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణ ఇస్తున్నారు. పాఠశాల విద్యార్థినులకు భద్రతపై అవగాహన కల్పించే విధంగా జిల్లా పోలీసు శాఖ ‘ప్రాజెక్ట్‌ స్కూల్‌’ అనే కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా కోవిల్‌పాళయం ప్రభుత్వ పాఠశాలకు చెందిన 34 మంది విద్యార్థినులకు అవగాహన కల్పించారు. సాయుధదళ కార్యాలయ ప్రాంగణంలో పోలీసులు వినియోగించే తుపాకులు, లాఠీలు(Guns and batons), అల్లర్లను అడ్డుకొనేలా వినియోగించే సామగ్రి తదితరాలపై విద్యార్థినులకు తెలియజేశారు. అనంతరం తుపాకి శిక్షణా కేంద్రానికి తీసుకెళ్లి పోలీసుల పర్యవేక్షణలో విద్యార్థినులకు రైఫిల్‌ షూటింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ అవగాహన తమలో సరికొత్త ఉత్సాహం నింపిందని విద్యార్థినులు పేర్కొన్నారు.

Updated Date - 2022-09-09T16:01:44+05:30 IST