Advertisement

రింగ్‌రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తా

Jan 23 2021 @ 23:38PM
వలంటీర్లతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ

మంత్రి బొత్స సత్యనారాయణ

నెల్లూరు(జడ్పీ), జనవరి 23 : సాధ్యాసాధ్యాలపై చర్చించి నగ రానికి రింగ్‌ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర మున్సిపల్‌శాఖ  మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయ న మాట్లాడారు. నగరానికి పెద్దఎత్తున నిధు లు మంజూరయ్యాయని, భారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రూ. 3.5కోట్లతో మూలాపేట కోనేరు ఆధునికీ కరణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. అలాగే ముస్లింల చిరకాల కోరిక అయిన గోషా ఆసు పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశాననీ, సంతపేట మార్కెట్‌ను అన్ని వసతులతో ఆధు నికీకరించి ప్రారంభించామనీ తెలిపారు. జనార్ద న్‌రెడి ్డ కాలనీలోని టిడ్కో గృహాలను పరిశీలిం చామని, పెండింగ్‌లో ఉన్న పనులను నాలుగైదు నెలల్లో పూర్తి చేయా లని అధికారులను ఆదేశించామన్నారు. అలాగే సంపూర్తిగా నిలిచి పోయిన రాజీవ్‌ స్వగృ హ ఇళ్ల పైనా సమీక్ష చేశామన్నారు. సమావే శంలో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌ కుమా ర్‌రెడ్డి, వరప్రసాద్‌, సంజీవయ్య, నాయకులు వీరిచలపతి, కొండూరు అనిల్‌  పాల్గొన్నారు.

కొనేరును సుందరంగా తీర్చిదిద్దాలి

నెల్లూరు(సాంస్కృతికం) : నగరంలోని మూలస్థానేశ్వరస్వామి ఆలయ కోనేరును సుందరంగా తీర్చిదిద్దాలని  రాష్ట్ర పురపాలక  శాఖ  మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశిం చారు. శనివారం రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి కోనేరు నిర్మాణ పనులు పరిశీలించారు. చైర్మన్‌ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కోనేరును నింపేందుకు పైపులైను వేయాలని కోరారు. దానిపై మంత్రి బొత్స కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ఇంజనీర్లతో కలిసి మాట్లాడారు.

 వలంటీర్లతో ముఖాముఖి...

 మంత్రి బొత్స తన పర్యటనలో వలంటీర్లతో ముఖాముఖిగా ముచ్చటించారు. మీరు వలం టీర్‌ పోస్టును కొన్నారా..? ఎవరైనా ఉంటే చెప్పండి అన్నారు. లేదు.. నిరుద్యోగులుగా ఉన్న తమకు ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వచ్చా యని వలంటీర్లు తెలిపారు.  ప్రభుత్వం ప్రక టించిన నవరత్నాలు అర్హులకు అందేలా పను లు చేయాలని మంత్రి అన్నారు. కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నాయ కులు రూప్‌కుమార్‌ యాదవ్‌, డివిజన్‌ ఇన్‌ చార్జిలతోపాటు దేవదాయ,ఽ దర్మాదాయశాఖ సహాయ కమిషనర్‌ పోరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ చైతన్య, ఈవో వేణుగోపాల్‌,మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

ఆనం ఇంటికి వెళ్లిన మంత్రి బొత్స

నెల్లూరు(జడ్పీ):  మంత్రి బొత్స సత్య నారాయణ నగరంలోని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి ఇంటికి వెళ్లారు. కొంత సేపు రామనారాయణరెడ్డితో చర్చించారు. అనంతరం వెంకటగిరి మున్సిపాలిటీకి సంబంధించి తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిలైట్లు, తది తర మౌలిక వసతుల కోసం ఆనం రూ.184.26 కోట్లతో పనులు మం జూరు చేయాలని ప్రతిపాదనలను మంత్రికి అందజేశారు.

బొత్సను సన్మానించిన కోటంరెడ్డి  సోదరులు

రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్‌రెడ్డి సన్మా నించారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయనను కార్పొరేషన్‌ కార్యాల యంలో కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.