మహిళతో ఆర్‌ఐ అసభ్యకర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-09-30T17:11:27+05:30 IST

పింఛన్‌ కార్డు కోసం వెళ్లిన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన ఆర్‌ఐకి ఆమె బంధువులు దేహశుద్ధి చేశారు. భోలక్‌పూర్‌లో నివసిస్తున్న ఓ మహిళ తన భర్త చనిపోవడంతో వితంతు

మహిళతో ఆర్‌ఐ అసభ్యకర వ్యాఖ్యలు

తహసీల్దార్‌ ఎదుటే బంధువుల దాడి

హైదరాబాద్/కవాడిగూడ: పింఛన్‌ కార్డు కోసం వెళ్లిన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన ఆర్‌ఐకి ఆమె బంధువులు దేహశుద్ధి చేశారు. భోలక్‌పూర్‌లో నివసిస్తున్న ఓ మహిళ తన భర్త చనిపోవడంతో వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. కార్డు ఇవ్వాలని స్పెషల్‌ ఆర్‌ఐ విజయ్‌నాయక్‌ను పలుమార్లు కోరింది. గురువారం మధ్యాహ్నం కూడా ముషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లింది. రోజూ ఇబ్బంది పెట్టొద్దని, ప్రేమతో అడిగి తీసుకోవాలని, ఒంటరిగా వస్తే ఇస్తానని ఆర్‌ఐ అసభ్యకరంగా మాట్లాడారు. ఆమె ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, బస్తీవాసులకు తెలియజేయడంతో వారు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. తహసీల్దార్‌ అయ్యప్ప సమక్షంలోనే ఆర్‌ఐపై దాడిచేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తహసీల్దార్‌ను నెట్టేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సిబ్బంది గాంధీనగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఇరువర్గాలను స్టేషన్‌కు తరలించారు. ఇరువురూ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంటరిగా వస్తే కార్డు ఇస్తాననలేదని ఆర్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-09-30T17:11:27+05:30 IST