Rishabh Pant టెస్ట్‌ల్లో భారత అత్యుత్తమ వికెట్-కీపర్ బ్యాట్స్‌మెన్ : Aakash Chopra

ABN , First Publish Date - 2022-07-04T00:44:08+05:30 IST

ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ సిరీస్‌‌‌లో రీషెడ్యూల్ అయిన 5వ ‘ఎడ్జ్‌బాస్టన్’ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ అద్భుతంగా రాణించాడు. 146 పరుగుల

Rishabh Pant టెస్ట్‌ల్లో భారత అత్యుత్తమ వికెట్-కీపర్ బ్యాట్స్‌మెన్ : Aakash Chopra

న్యూఢిల్లీ : ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ సిరీస్‌‌‌లో రీషెడ్యూల్ అయిన 5వ ‘ఎడ్జ్‌బాస్టన్’ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ అద్భుతంగా రాణించాడు. 146 పరుగుల భారీ సెంచరీ చేయడంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 416 పరుగులు చేయగలిగింది. 98/5 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన భారత్‌ను గట్టెక్కించడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. 6వ వికెట్‌కు రవీంద్ర జడేజాతో  కలిసి 222 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ఇన్నింగ్స్‌ని పునరుద్ధరించాడు. ఇంతటి చక్కటి ఇన్నింగ్స్‌ ఆడిన రిషబ్ పంత్‌పై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన టెస్ట్ వికెట్‌కీపర్- బ్యాట్స్‌‌మెన్లలో రిషబ్ పంతే అత్యుత్తమమని కొనియాడాడు. ‘‘ టెస్టుల్లో భారత్‌ తరపును అత్యుత్తమ వికెట్‌కీపర్- బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్. అతడికి ఇంకా 25 ఏళ్లు కూడా లేవు. ఇప్పటివరకు కేవలం 30 మ్యాచ్చులే ఆడినా సంచలనమైన ఇన్నింగ్స్ ఆడాడు’’ అని ట్వీట్ చేశాడు.


కాగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా రాణించాడు. 104 పరుగుల సెంచరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా మూడవ రోజు ఇంకా 65 ఓవర్లు మిగిలివున్న సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. బెయిర్‌స్టో సెంచరీతో అదరగొట్టాడు. 

Updated Date - 2022-07-04T00:44:08+05:30 IST