Rishi Sunak: ఓటర్లతో ముఖాముఖిలో రిషికి ఇబ్బందికర ప్రశ్న.. మాజీ ప్రధానికి 'వెన్నుపోటు' అంటూ..

ABN , First Publish Date - 2022-07-30T17:46:06+05:30 IST

బ్రిటన్ ప్రధాని రేసు (UK PM race)లో ఉన్న అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రిషి సునాక్ (Rishi Sunak), లిజ్​ ట్రస్​ (Liz Truss)లు పార్టీ ఓటర్ల ఆదరణను చూరగొనే పనిలో పడ్డారు.

Rishi Sunak: ఓటర్లతో ముఖాముఖిలో రిషికి ఇబ్బందికర ప్రశ్న.. మాజీ ప్రధానికి 'వెన్నుపోటు' అంటూ..

లండన్: బ్రిటన్ ప్రధాని రేసు (UK PM race)లో ఉన్న అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రిషి సునాక్ (Rishi Sunak), లిజ్​ ట్రస్​ (Liz Truss)లు పార్టీ ఓటర్ల ఆదరణను చూరగొనే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా కన్జర్వేటివ్ ప్రచార కార్యాలయం ఇరువురు నేతలతో గురువారం ఓటర్లతో మమేకం అయ్యేందుకు ఓ ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఓటర్లు రిషి, ట్రస్​ల విధానాలపై పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా రిషికి ఓ ఓటరు (Voter) ఒక ఇబ్బందికర ప్రశ్న వేశారు. అదేంటంటే.. "ఉన్నపళంగా ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా (Resign) చేయడం అనేది మీరు మీ నాయకుడు బోరిస్ జాన్సన్‌ (Boris Johnson)కు వెన్నుపోటు పొడిచారని కొందరు చెబుతున్నారు. దీనిపై మీరేం అంటారు?" అని ఓ ఓటరు రిషిని అడిగారు. దీనికి ఆయన తనదైనశైలి సమాధానం చెప్పారు. మొదట ఈ అభిప్రాయాన్నిరిషి పూర్తిగా ఖండించారు. ఆర్థిక విధానాల విషయమై తమ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతోనే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అంతేగానీ అందులో వేరే ఉద్దేశమేమి లేదని వివరించారు. 


ఇదిలాఉంటే.. బ్రిటన్‌ ప్రధాని రేసులో తాను వెనుకంజలో ఉన్నట్టు రిషి సునాక్‌ తాజాగా అంగీకరించారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు పన్నుల్లో కోత విధింలేది లేదన్న తన వాగ్దానం అందరినీ ఆకట్టుకోలేకపోయిందని సునాక్‌ తెలిపారు. అయితే చివరి వరకు విజయం కోసం ప్రయత్నిస్తానన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులతో జరిగిన తొలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక వచ్చే సోమవారం నాడు అభ్యర్థులిద్దరూ నైరుతి ఇంగ్లాండ్‌‌లోని ఎక్సెటర్‌లో పార్టీ ఓటర్ల ముందుకువెళ్లనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రిషికి ఎంపీల మద్దతు ఉన్నా పార్టీ ఓటర్లలో ఆయన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ (Liz Truss) వైపు కొంత మొగ్గు ఉన్నట్లు సమాచారం. దీనికి ఊతమిస్తూ ఆమెకు మద్దతు పెరుగుతున్నట్టు పలు సర్వేల రిపోర్టులు వస్తున్నాయి. ఇక తాను ప్రధాని అయితే దేశ పన్నుల విధానాన్ని పూర్తిగా సవరిస్తానని లిజ్ వాగ్దానం చేస్తున్నారు. అలాగే కార్పొరేట్‌ ట్యాక్స్‌లు, ఇన్సూరెన్స్‌ ధరలు తగ్గిస్తానని హామీ ఇస్తున్నారు. ఇవి వాగ్దానాలు ఆమెకు కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


Updated Date - 2022-07-30T17:46:06+05:30 IST