Britain PM Elections: కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు.. ఈ సమయంలో రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు.. ఒకవేళ ఓటమి చెందితే..

ABN , First Publish Date - 2022-09-05T13:12:12+05:30 IST

బ్రిటన్ ప్రధాని పదవికి హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. మరికొద్ది గంటల్లో తుది ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల(Britain PM Elections)పై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో.. రిషి సునాక్(Rishi Sunak) కీలక వ్యాఖ్యలు చేశారు.

Britain PM Elections: కొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు.. ఈ సమయంలో రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు.. ఒకవేళ ఓటమి చెందితే..

ఎన్నారై డెస్క్: బ్రిటన్ ప్రధాని పదవికి హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. మరికొద్ది గంటల్లో తుది ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల(Britain PM Elections)పై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో.. రిషి సునాక్(Rishi Sunak) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఎన్నికల్లో తాను ఓటమి చెందితే.. తదుపరి కార్యచరణ ఏంటనే అంశంపై తన మనసులోని మాటను బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్న తరుణంలో రిషి సునాక్ మీడియాకు ఇంటర్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో లిజ్ ట్రస్(Liz Truss) చేతిలో తాను ఓడిపోతే.. తదుపరి ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తానన్నారు. ఎంపీగా కొనసాగుతూ.. తన నియోజకవర్గ ప్రజల కోసం పని చేయనున్నట్టు చెప్పారు. ‘ఎన్నికల్లో ఫలితం అనుకూలంగా రాకపోతే.. పార్లమెంట్ సభ్యడిగా కొనసాగుతా. కన్జర్వేటివ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తా. నియోజకవర్గంలో ప్రజల మద్దతు ఉన్నంతకాలం వారికి అందుబాటులోనే ఉంటా’ అని అన్నారు. 


ఇదిలా ఉంటే.. బ్రిటన్ ప్రధాని పదవికి జరిగిన ఎన్నికల్లో రిషి సునాక్, లిజ్ ట్రస్ హోరాహోరీగా తలపడ్డారు. అయితే ఎన్నికలు ముగిసిన అనంతరం వెల్లడైన సర్వే ఫలితాలు లిజ్ ట్రస్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపొందేది లిజ్ ట్రస్సే అని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.  


Updated Date - 2022-09-05T13:12:12+05:30 IST