UK PM Candidate: భార్య అక్షతా మూర్తి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రిషి సునాక్!

ABN , First Publish Date - 2022-08-08T17:46:38+05:30 IST

రిషి సునాక్.. చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో ఉన్నారు. లిజ్ ట్రస్‌పై విజయం సాధిస్తే.. బ్రిటన్ ప్రధాని పీఠం ఆయన సొంతం అవుతుందన్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో బిజీ.. బిజీగా ఉన్న సునాక్.. తన భార్య ఇన్ఫోసిస్ నారాయణమూర్తి(

UK PM Candidate: భార్య అక్షతా మూర్తి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రిషి సునాక్!

ఎన్నారై డెస్క్: రిషి సునాక్.. చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో ఉన్నారు. లిజ్ ట్రస్‌పై విజయం సాధిస్తే.. బ్రిటన్ ప్రధాని పీఠం ఆయన సొంతం అవుతుందన్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో బిజీ.. బిజీగా ఉన్న సునాక్.. తన భార్య, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి( Narayana Murthy) కూతురు అక్షతా మూర్తి(Akshata Murty) గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ ఇంటర్యూలో పాల్గొన్న సునాక్.. పెళ్లినాటి విషయాలను పంచుకున్నారు. 


‘నేను చాలా క్రమశిక్షణతో ఉంటాను. నాకు  వస్తువులను చక్కగా అమర్చుకునే అలవాటు ఉంది. కానీ అక్షతా అలా కాదు. ఎక్కడ పడితే అక్కడ దుస్తులు.. బూట్లు(Shoes) పడేస్తూ ఉంటుంది. అయితే తనకు సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. అక్షతా గురించి ఈ విషయాలు చెప్పడం తనకు అస్సలు నచ్చదు. అయినప్పటికీ.. నేను నా మనసులో మాటలను బయటపెడుతున్నా’ అంటూ సునాక్ తన భార్య గురించి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ‘పిల్లలు పుట్టే సమయానికి సొంతంగా బిజినెస్ నడుపుతున్నాను. అందువల్ల వాళ్లతో గడపటానికి కావాల్సిన సమయం దొరికేది. అలా.. పిల్లలతో ప్రతిక్షణాన్ని ఆస్వాదించగలిగా’ అన్నారు. 



సునాక్(Rishi Sunak).. భారత సంతతి దంపతులకు Southampton(సౌతాంప్టన్)లో జన్మించారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన ఎంబీఏ పూర్తి చేశారు. అక్కడే సునాక్‌కు అక్షతా మూర్తితో పరిచయం ఏర్పడింది. తర్వాత వారిద్దరూ 2006లో బెంగళూరులో వివాహం చేసుకున్నారు. అనంతరం కృష్ణ(11), అనౌష్క (9) అనే ఇద్దరు అమ్మాయిలకు ఈ దంపతులు జన్మనిచ్చారు. 


ఇదిలా ఉంటే.. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో సునాక్ ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అక్షతా మూర్తి పన్నుల చెల్లింపు వ్యవహారం వివాదాస్పదం అయింది. ఈ నేపథ్యంలో ఆయన డౌనింగ్ స్ట్రీట్‌‌లోని తన అధికార నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే.. బ్రిటన్ ప్రధానిగా అనేక ఆరోపణలు ఎదుర్కొన్న జాన్సన్.. ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం సునాక్(UK Prime Ministerial Candidate).. బ్రిటన్ ప్రధాని పీఠానికి పోటీ పడుతున్నారు. ఎన్నికల రేసులో అనేక దశలను విజయవంతంగా ఎదుర్కొన్న సునాక్.. ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్నారు. లిజ్ ట్రస్‌పై విజయం సాధిస్తే.. సునాక్ చరిత్ర సృష్టించనట్టే. అయితే.. లిజ్ ట్రస్, సునాక్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.


Updated Date - 2022-08-08T17:46:38+05:30 IST