Janmashtami 2022: శ్రీకృష్ణుడిని దర్శించుకున్న రిషి సునాక్.. పిక్ వైరల్

ABN , First Publish Date - 2022-08-19T16:43:47+05:30 IST

బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ తన భార్య అక్షత మూర్తితో కలిసి గురువారం వాట్‌ఫోర్డ్‌లోని భక్తివేదాంత శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించారు.

Janmashtami 2022: శ్రీకృష్ణుడిని దర్శించుకున్న రిషి సునాక్.. పిక్ వైరల్

లండన్: బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ తన భార్య అక్షత మూర్తితో కలిసి గురువారం వాట్‌ఫోర్డ్‌లోని భక్తివేదాంత శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాట్‌ఫోర్డ్‌ (Watford)లోని ఇస్కాన్ (ISKCON) టెంపులన్‌ను సందర్శించినట్లు రిషి ట్వీట్ చేశారు. "నా భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత ఆలయానికి వెళ్లి జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నా. కృష్ణుడి పుట్టిన రోజు సందర్భంగా హిందువులు ఈ పండుగ జరుపుకుంటారు" అని ట్వీట్ చేశారు. ఆలయంలో సతీమణి అక్షత కలిసి దిగిన ఫొటోను ఈ ట్వీట్‌కు జత చేశారు. దీంతో హిందూ మూలాలు మర్చిపోని రిషిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక 2019 డిసెంబర్‌లో సునాక్ యూకే హౌజ్ ఆఫ్ కామన్స్‌ మెంబర్‌గా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో కూడా చేతిలో భగవద్గీతతో కనిపించారు. 


ఇదిలాఉంటే.. బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కంటే వెనుకబడి ఉన్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం లిజ్ కంటే సునాక్ 32 పాయింట్ల వెనుకంజలో (రిషికి 28శాతం, లిజ్‌కు 60శాతం మంది కన్జర్వేటివ్ సభ్యులు మద్ధతు ఇస్తున్నారు) ఉన్నట్లు సర్వే రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. కాగా, వచ్చే నెల 5వ తేదీన కన్జర్వేటివ్ పార్టీ తన తదుపరి ప్రధానిని ప్రకటించనుంది. ఆ రోజు యూకే 78వ ప్రధాని ఎవరనేది తేలిపోతుంది. 



Updated Date - 2022-08-19T16:43:47+05:30 IST