Britain pm race: భార్యాపిల్లలతో ర్యాలీలో పాల్గొన్న రిషి సునాక్.. కుటుంబమే నా సర్వస్వమంటూ..

ABN , First Publish Date - 2022-07-25T02:45:00+05:30 IST

బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న భారత సంతతి మాజీ మంత్రి రిషి సునాక్(Rishi Sunak) శనివారం ఇంగ్లండ్‌లోని గ్రాంథమ్ టౌన్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు.

Britain pm race: భార్యాపిల్లలతో ర్యాలీలో పాల్గొన్న రిషి సునాక్.. కుటుంబమే నా సర్వస్వమంటూ..

ఎన్నారై డెస్క్: బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న భారత సంతతి మాజీ మంత్రి రిషి సునాక్(Rishi Sunak) శనివారం ఇంగ్లండ్‌లోని గ్రాంథమ్ టౌన్‌లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రిషితో పాటూ ఆయన భార్య అక్షతా మూర్తి, పిల్లలు కృష్ణ, అనౌష్క కూడా పాల్గొన్నారు. భర్త ప్రచార కార్యక్రమంలో అక్షతా మూర్తి పాల్గొనడం ఇదే తొలిసారి. కాగా.. బ్రిటన్ మాజీ ప్రధాని, ఉక్కుమహిళ మార్గరేట్ థాచర్ జన్మస్థలమైన గ్రాంథమ్‌లో రిషి.. తన మద్దతుదారులను ఉద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు. ఆ ర్యాలీకి సంబంధించిన చిత్రాలను ఆయన తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ‘‘కుటుంబమే నా సర్వస్వం. నిన్న జరిగిన ర్యాలీలో నాతో పాటూ వారు పాల్గొని నాకు మద్దతుగా నిలిచారు.’’ అని ఇన్‌స్టా వేదికగా వ్యాఖ్యానించారు.


ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి అన్న విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్‌లో అక్షతామూర్తికి వాటాలున్నాయి. అయితే.. బ్రిటన్‌లో ఆమెకు స్థానికత హోదా లేదన్న కారణంతో గతంలో పన్నులు చెల్లించలేదు. రిషి సునాక్ ప్రత్యర్థులు దీన్నో అవకాశంగా తీసుకుని ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు. బ్రిటన్ రాణి కన్నా అక్షతా మూర్తి ధనవంతురాలంటూ బ్రిటన్ మీడియా పలు సందర్భాల్లో కామెంట్ చేసింది. ఈ క్రమంలో రిషికి సామాన్య ప్రజల కష్టాలు తెలియవంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శించారు. 





Updated Date - 2022-07-25T02:45:00+05:30 IST