కాళి వెంకట్‌ సరసన రిత్విక

Jun 14 2021 @ 07:44AM

‘పరదేశి’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు నటిగా పరిచయమైన  రిత్విక  ‘మద్రాస్‌’ అనే చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘అళకుట్టి సెల్వం’, ‘అంజల్‌’, ‘కబాలి’, ‘ఒరునాళ్‌ కూత్తు’, ‘ఇరుముగన్‌’, ‘ఎనక్కు వేరెంగుమ్‌ కిళైగళ్‌ కిడైయాదు’, ‘ఓనాయ్‌గళ్‌ జాగ్గిరతై’, ‘టార్చ్‌లైట్‌’, ‘సికై’, ‘ఇరాండాం ఉలగపోరిన్‌ కడైసి గుండు’ వంటి చిత్రాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో అతి కీలకమైన పాత్రల్లో కనిపించింది. అయితే, ‘మాడు’ అనే చిత్రం ద్వారా తొలి హీరోయిన్‌గా అవకాశం లభించింది. ఈ చిత్రంలో ఈమెకు జోడీగా హాస్య నటుడు కాళి వెంకట్‌ నటిస్తున్నారు. నూతన దర్శకుడు బ్రహ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ విజేతగా నిలిచిన తర్వాత తనకు మంచి భవిష్యత్‌ ఉంటుందని భావించిన రిత్వికకు ఆమె భావించినట్టుగా సరైన అవకాశాలు రాలేదు. అయితే, ఇప్పుడు ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం రావడంతో ఆ చిత్రంలో నటించేందుకు కమిటయ్యింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.