Advertisement

మాస్ మహారాజ్ సరసన రితూ వర్మ?

Oct 16 2020 @ 15:18PM

`పెళ్లి చూపులు` సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రితూ వర్మ.. తమిళ, మలయాళ భాషల నుంచి మంచి అవకాశాలు అందుకుంటోంది. తాజాగా తెలుగు నుంచి కూడా రితూకు ఓ మంచి ఆఫర్ వచ్చిందట.


మాస్ మహారాజ్ రవితేజ సరసన రితూ హీరోయిన్‌గా కనిపించబోతోందట. దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. రవితేజ ప్రస్తుతం చేస్తున్న `క్రాక్` పూర్తయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.