ఆ నది పొడవు 6400 కి.మీ.. ఒక్క వంతెన కూడా లేదంటే నమ్ముతారా?

ABN , First Publish Date - 2022-05-31T15:09:47+05:30 IST

అమెజాన్.. ప్రపంచంలో రెండవ అతిపెద్ద నది..

ఆ నది పొడవు 6400 కి.మీ.. ఒక్క వంతెన కూడా లేదంటే నమ్ముతారా?

అమెజాన్.. ప్రపంచంలో రెండవ అతిపెద్ద నదిగా పేరొందింది. దీని పొడవు 6400 కి.మీ. దాటి ఉంటుంది. దక్షిణ అమెరికాలోని దాదాపు 9 రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న ఈ నదికి సంబంధించిన కొన్ని విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ నదిపై ఒక్క వంతెన కూడా నిర్మించిన దాఖలాలు లేవు. అమెజాన్ నది లక్షలాది జలచరాలకు నిలయం. ఇందులో అత్యధిక సంఖ్యలో డాల్ఫిన్‌లు కనిపిస్తాయి. 


ఈ నది దక్షిణ అమెరికాలో 40 శాతం మేర విస్తరించింది. ఈ నది బొలీవియా, బ్రెజిల్, పెరూ, కొలంబియా, ఈక్వెడార్, వెనిజులా, ఫ్రెంచ్ గయానా, గయానా, సురినామ్ రాష్ట్రాల గుండా వెళుతుంది. అయినప్పటికీ ఈ నదిపై ఒక్క వంతెన కూడా ఎందుకు నిర్మించలేదో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.  చిన్నచిన్న నదులపైననే భారీ వంతెనలు కనిపిస్తుండగా.. అత్యంత పొడవైన ఈ నదిపై ఎలాంటి వంతెన లేకపోవడం విశేషం. అయితే దీని వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. నదిపై వంతెన నిర్మించకపోవడానికి అతి పెద్ద కారణం అవసరం లేకపోవడమే. ఈ నది ప్రజోపయోగం లేని ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. నది ప్రవహించే ప్రదేశాలో జనాభా చాలా తక్కువ. దీనికి తోడు ఈ నది ఒడ్డున నేల చాలా మృదువైనది కావడంతో వంతెన నిర్మాణానికి భారీ వ్యయం అవుతుంది. ఈ కారణంగానూ ఈ నదిపై వంతెన నిర్మించలేదు. 

Updated Date - 2022-05-31T15:09:47+05:30 IST