ఈ–వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ‘ఈ-సఫాయి’ని ప్రకటించిన ఆర్‌ఎల్‌జీ ఇండియా, జిజ్‌ ఇండియా

ABN , First Publish Date - 2020-11-13T00:06:31+05:30 IST

ఈ–వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ‘ఈ-సఫాయి’ని ప్రకటించిన ఆర్‌ఎల్‌జీ ఇండియా, జిజ్‌ ఇండియా

ఈ–వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ‘ఈ-సఫాయి’ని ప్రకటించిన ఆర్‌ఎల్‌జీ ఇండియా, జిజ్‌ ఇండియా

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఈ–వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ‘ఈ-సఫాయి’ను ఆర్‌ఎల్‌జీ ఇండియా మరియు జిజ్‌ ఇండియా ప్రకటించాయి. పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్ట్‌ను ‘సెట్టింగ్‌ అప్‌ ఇన్నోవేటివ్‌ వాల్యూ చైన్‌ ఫర్‌ ఈ–వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’గా కూడా పిలుస్తున్నారు. దీనికి జర్మన్‌ ఫెడరల్‌ మినిస్ట్రీ ఫర్‌ ఎకనమిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (బీఎంజెడ్‌) మద్దతునందిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, పాఠశాలలు, రిటైలర్లు, భారీ వినియోగదారులు సహా పలువురు వాటాదారులకు సురక్షితంగా మరియు స్థిరమైన విధానంలో ఈ–వ్యర్థాలను నిర్వహించడం గురించి అవగాహన కల్పించడం. అసంఘటిత రంగంలో సంఘటిత ఈ–వ్యర్ధ నిర్వహణ వాల్యూ చైన్స్‌ తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించింది.


వరుసగా పలు ఆన్‌లైన్‌ మరియు ఆన్‌గ్రౌండ్‌ క్యాంపెయిన్స్‌ను ఢిల్లీ మరియు హైదరాబాద్‌లలో రాబోయే మూడేళ్లలో నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఈ–వ్యర్ధాలను సాధారణ రీసైక్లింగ్‌ కోసం మార్గాంతరీకరణ చేయడంతో పాటుగా అసంఘటిత రంగ సామర్థ్యం వృద్ధి చేయడం ద్వారా ఈ–వ్యర్థాలను నాశనం చేసే మౌలిక వసతులను బలోపేతం చేయనున్నారు. 



Updated Date - 2020-11-13T00:06:31+05:30 IST