ఉపరాష్ట్రపతికి వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం
రామ్‌నగర్, జనవరి 21: విలేజ్ క్లినిక్‌లలో ఆర్‌ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులను క్లినిక్‌కు ఒకరు చొప్పున హెల్త్ ప్రొవైడర్లుగా నియమించేలా నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు సిఫారసు చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు, ఆర్‌ఎంపీ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగం జోషి కోరారు. ఈ మేరకు శుక్రవారం పోర్టు గెస్ట్‌హౌస్‌లో ఉపరాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న విలేజ్ క్లినిక్‌లలో గ్రామీణ వైద్యులకు అవకాశం కల్పించాలని కోరారు. గతంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి విన్నవించుకున్నామని తెలిపారు. దీనిపై ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అడ్వయి జరీ కమిటీ చైర్మన్ ఎం.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.