డేంజర్‌

ABN , First Publish Date - 2021-07-24T06:19:58+05:30 IST

శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారి రక్తసిక్తమవుతోంది.

డేంజర్‌
ట్రాక్టర్‌లో మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం

- రక్తమోడుతున్న శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారి

- ప్రమాదాలకు అడ్డాగా చెన్నారం స్టేజీ

- తాజాగా రెండు కార్లు ఢీకొని ఏడుగురి మృతి

- సూచిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు లేక ప్రమాదకర పరిస్థితి

- నిత్యం యాక్సిడెంట్లు జరుగుతున్నా స్పందించని అధికారులు


అచ్చంపేట/ఉప్పునుంతల, జూలై 23 : శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారి రక్తసిక్తమవుతోంది. నా గర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం పిరట్వానిపల్లి, అచ్చం పేట మండలం చెన్నారం స్టేజీల మధ్య నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పిరట్వానిపల్లి-చెన్నారం స్టేజీల మధ్య దాదాపు అరకిలోమీటర్‌ వరకు రోడ్డు ఎగుడుదిగుడుగా ఉం డటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించే పరిస్థితి లేదు. దీ నికితోడు దిగుడు ప్రాంతం మీదుగా వాహనాలు అతి వేగంగా వస్తుండటంతో, ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాటిని ఢీ కొంటున్నాయి. ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో పదుల కొద్ది మంది మృతి చెందారు. మరికొందరు క్షతగాత్రులుగా మిగిలారు. గతంలో మహారాష్ట్రకు చెందిన క్రూయిజర్‌ వాహనం కల్వర్టును ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. అలాగే శ్రీశైలం నుంచి వస్తున్న కారు చెట్టును ఢీ కొట్టడంతో ఇద్దరు చనిపోయారు. గత ఏడాది రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో, ఓ మహిళ మృతి చెందింది. అలాగే పలు సందర్భాల్లో ద్విచక్ర వాహనాలు కూడా ఢీకొని ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు మరువక ముందే శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొనడంతో ఏడుగురు మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశై లం వెళ్తున్న నలుగురు, శ్రీశైలం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ము గ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరొకరు గాయపడ్డారు.


మొద్దునిద్రలో అధికారులు

పిరట్వానిపల్లి-చెన్నారం స్టేజీల మధ్య ప్రమాదాలు జరుగుతు న్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. కేవలం ప్రమాదాలు జరిగిన సందర్భంలో మాత్రమే హడావుడి చే సి, ఆ తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎగుడుదిగుడు ప్రాంతంలో సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయలేదు. చెన్నారం స్టేజీ వద్ద స్పీడ్‌ బ్రేకర్లను కూడా ఏర్పాటు చే యలేదు. దీంతో ఈ అర కిలోమీటర్‌ మార్గంలో రోడ్డు ఎటు వైపు మలుపులు తిరిగిందో తెలియక వాహనదారులు తికమక పడు తున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక, వాటిని ఢీ కొని ప్రాణాలు కోల్పోతున్నారు.


అచ్చంపేట ఆసుపత్రికి మృతదేహాలు

ప్రమాదంలో మృతి చెందిన వారి దేహాలను పోలీసులు అచ్చంపేట ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. వారు సుదూర ప్రాం తాల్లో ఉండటం వల్ల సంఘటనా స్థలానికి చేరుకోలేకపోయారు. రాత్రి కావడంతో శనివారం ఉద యం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు డీఎస్పీ నర్సింహులు తెలిపారు. కలెక్టర్‌ శర్మన్‌, ఎస్పీ సాయిశేఖర్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆర్డీవో పాండు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో మహిళ మృతదేహం గుర్తు పట్టలే నంతగా చితికిపోయింది. ఆమె శవాన్ని ట్రాక్టర్‌పైకి తీసుకెళ్లేందుకు గ్రామస్థులు నానా తంటాలు పడ్డారు. గాయపడ్డ నరేష్‌ను మాత్రం కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారులో ఇ రుక్కున్న మృతదేహాలను సమీప గ్రామ యువకుల సహాయంతో అతికష్టమ్మీద బయటికి తీశారు. మృతదేహాలను ట్రాక్టర్లలో వేసుకొని ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారి కావడం తో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్‌ల సహాయంతో పక్కకు తొలగించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా, మృతదేహాలు అనాథ శవాలుగా మార్చురీలో ఉండటం స్థానికులను కలిచి వేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.



Updated Date - 2021-07-24T06:19:58+05:30 IST