రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం

ABN , First Publish Date - 2020-12-03T04:54:22+05:30 IST

రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం

ఘట్‌కేసర్‌ రూరల్‌ : ఎదురుగా వస్తున్న ఆటోట్రాలీ ఢీకొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి అవుశాపూర్‌లో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అవుశాపూర్‌ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ కుమారుడు డొంకెని శ్రీకాంత్‌గౌడ్‌(35) ఘట్‌కేసర్‌ నుంచి మంగళవారం రాత్రి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా ఇండియన్‌ బావర్చి హోటల్‌ వద్దకు రాగానే  ఎదురుగా వస్తున్న ఆటోట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌గౌడ్‌ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

శ్రీకాంత్‌ కుటుంబసభ్యులకు మంత్రి పరామర్శ

రోడ్డుప్రమాదంలో మృతిచెందిన డొంకెని శ్రీక్రాంత్‌గౌడ్‌ కుటుంబసభ్యులను రాష్ట్ర కార్మిక,  ఉపాధికల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి ఓదార్చారు. అంతకుముందు అయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, శ్రీకాంత్‌గౌడ్‌ తండ్రి సింగిల్‌విండో మాజీ చైర్మన్‌, అవుశాపూర్‌ మాజీ సర్పంచు డొంకెని బిక్షపతిగౌడ్‌, అతని కుటుంసభ్యులను  వారు పరామర్శించారు. ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, పోచారం మున్పిపల్‌ చైర్మన్‌  కొండల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బండారి దాసు, శ్రీనివా్‌సగౌడ్‌, గడ్డి అన్నారం మార్కెట్‌ డైరెక్టర్‌ పన్నాల కొండల్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటే్‌షగౌడ్‌, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ సారా శ్రీనివా్‌సగౌడ్‌, నాయకులు, వార్డుసభ్యులు, కౌన్సలర్లు శ్రీకాంత్‌గౌడ్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు. 

అన్నోజిగూడలో మరొకరు..

రోడ్డుదాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి అన్నోజిగూడలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పోచారం మున్సిపాలిటీ, అన్నోజిగూడ శ్రీలక్ష్మీనర్సింహకాలనీకి చెందిన సాయిదాస్‌ (47) మంగళవారం రాత్రి రోడ్డు దాటుతుండగా అన్నోజిగూడ వద్ద ఉప్పల్‌ వైపునకు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈప్రమాదంలో సాయిదాస్‌ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2020-12-03T04:54:22+05:30 IST