రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-01-16T05:57:58+05:30 IST

చినపులిపాక - కంకిపాడు రోడ్డులో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో తోట్లవల్లూరు గ్రామానికి చెందిన వల్లూరు నిరంజన్‌కుమార్‌(20) దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

తోట్లవల్లూరు, జనవరి 15 : చినపులిపాక - కంకిపాడు రోడ్డులో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో తోట్లవల్లూరు గ్రామానికి చెందిన వల్లూరు నిరంజన్‌కుమార్‌(20) దుర్మరణం చెందాడు. నిరంజన్‌కుమార్‌ బైక్‌పై కంకిపాడు నుంచి తోట్లవల్లూరు వస్తుండగా చినపులిపాక సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీకొంది. బాధితుడిని ఉయ్యూరు ఆస్పత్రికి తరలిస్తుండగా  మృతిచెందాడని ఎస్సై ఎం.కిషోర్‌బాబు తెలిపారు. మృతుని తల్లి కుమారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2021-01-16T05:57:58+05:30 IST