Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-08-21T15:16:52+05:30 IST

అనంతపురం (Anantapuram): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది.

Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం (Anantapuram): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కళ్యాణదుర్గం మండలం, గోళ్ళ గ్రామ సమీపంలో, ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో బాలు, విక్కీ అనే ఇద్దరు డిగ్రీ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-08-21T15:16:52+05:30 IST