కశ్మీర్‌ రోడ్డు ప్రమాదంలో జవాను దుర్మరణం

ABN , First Publish Date - 2022-04-20T13:13:15+05:30 IST

కశ్మీర్‌లోని హైదర్‌బోరా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పళ్ళిపట్టుకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను మృతి చెందారు. తిరువళ్లూరు జిల్లా పళ్ళిపట్టు సమీపంలోని అత్తిమాంజేరికి చెందిన

కశ్మీర్‌ రోడ్డు ప్రమాదంలో జవాను దుర్మరణం

                                 - మృతుడు అత్తిమాంజేరి వాసి


చెన్నై: కశ్మీర్‌లోని హైదర్‌బోరా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పళ్ళిపట్టుకు చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను మృతి చెందారు. తిరువళ్లూరు జిల్లా పళ్ళిపట్టు సమీపంలోని అత్తిమాంజేరికి చెందిన ఎంఎస్‌ మణి సెంట్రల్‌ రిజర్వు పోలీసుదళంలో జమ్ముకశ్మీర్‌లో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ మణి సహా 12 మంది జవాన్లు శ్రీనగర్‌ నుంచి ఓ బస్సులో వెళుతుండగా హైదర్‌బోరా వద్ద అదుపుతప్పిన లారీ ని ఢీకొంది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన మణిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స ఫలించక మృతి చెందారు. తక్కిన జవాన్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మణి మృతి చెందినట్లు సమాచారం అందటంతో అత్తిమాంజేరిలోని ఆయన కుటుంబీకులు బోరున విలపించారు. మణి భౌతికకాయాన్ని వీలయినంత త్వరగా స్వస్థలానికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. సీఆర్‌పీఎఫ్‌ దళంలో పనిచేస్తున్న తమిళ జవాను మణి మృతిపట్ల పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు అన్బుమణి రాందాస్‌ తీవ్ర సంతాపం ప్రకటించారు. దేశాన్ని కాపాడేందుకు సేవలందిస్తున్న మణి ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడటం దిగ్ర్భాంతి కలిగిస్తోందని ఓ ప్రకటన జారీ చేశారు.

Updated Date - 2022-04-20T13:13:15+05:30 IST