ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కిందకు దూసుకుపోయిన ఆటో

ABN , First Publish Date - 2021-02-27T03:19:10+05:30 IST

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కిందకు దూసుకుపోయిన ఆటో

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కిందకు దూసుకుపోయిన ఆటో

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ఉదయగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు కిందకి ఆటో దూసుకుపోయింది. క్రేన్‌ సాయంతో ఆటోని  పోలీసులు బయటికి తీస్తున్నారు. ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.


ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆటోలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో తెలియాలంటే బస్సు కింద ఉన్న ఆటోను బయటకు తీస్తే కానీ చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2021-02-27T03:19:10+05:30 IST