రావులపాలెం
రూరల్, మార్చి 27: కుమార్తెను తీసుకువచ్చేందుకు బయలుదేరిన తల్లి
మార్గమఽధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కడియపులంకకు చెందిన
కొత్తపల్లి అమ్మాజీ (40), భర్త వెంకన్నతో కలిసి మోటారు సైకిల్‌పై పశ్చిమ
గోదావరి జిల్లా ఖండవిల్లిలోని కుమార్తెను చూసేందుకు ఆదివారం బయల్దేరింది.
రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపానికి వచ్చేసరికి మోటారు సైకిల్‌కు
కుక్క అడ్డురావడంతో వెంకన్న ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ఆమె రోడ్డుపై
పడిపోయింది. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఆమె పైనుంచి
దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్ఐ భానుప్రసాద్ సంఘటనా
స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని
కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.