
విజయవాడ: పెళ్లి వేడుకలతో ఆనందం వెళ్లివిరియాల్సిన ఆ ఇంట్లో ఆక్రందనలు చోటు చేసుకున్నాయి. కృష్ణా జిల్లా మోపిదేవి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురు దుర్మరణం చెందారు. పెళ్లి వేడుకలకు వెళ్తున్న తరుణంలో ప్రమాదం జరిగింది. చింతలమడ గ్రామం నుంచి పెడప్రోలు గ్రామంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు వెళ్లేందుకు పెళ్లి బృందం సిద్ధమైంది. బోలోరో వాహనంలో బంధువులు బయలుదేరారు. కాగా మోపిదేవి మండలం కాశానగర్ వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా... మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చల్లపల్లి, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన 15 మందిలో పది మందికి తీవ్రగాయాలయ్యాయని... వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో పరిమితికి మించి 20 మంది వాహనంలో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి