ప్రకాశం జిల్లా చీరాల బైపాస్‌లో రోడ్డు ప్రమాదం

Published: Sat, 16 Oct 2021 09:35:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రకాశం జిల్లా చీరాల బైపాస్‌లో రోడ్డు ప్రమాదం

ఒంగోలు : ప్రకాశం జిల్లా చీరాలలో దసరా పండగ పూట విషాదం నెలకొంది. చీరాల బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానాన్ని లారీ డీకొన్నది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రవిచంద్(20), విల్సన్(18)లుగా గుర్తించారు. వీరిద్దరూ మరియమ్మ పేట, సాయికాలనీ వాసులుగా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో సాయికాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.