
వికారాబాద్: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పూడూరు మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేశవరెడ్డి స్కూల్ సమీపంలో బైకును కారు ఢీకొట్టింది. బైకుపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రాకంచర్ల గ్రామానికి చెందిన యాదయ్య (22),సంతోష్ (21) లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి