కృష్ణా: నందిగామ బైపాస్ వద్ద బుల్లెట్ బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మునగలపల్లి మధుగా గుర్తించారు. ఖమ్మం నుండి తెనాలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.