కడప: రైల్వేకోడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతరాజుపేట వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న కోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.