కృష్ణా: ముదినేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెవురుపాలెం సెంటర్ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగరాజు, నాని కలిదిండి వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.