Advertisement

త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

Feb 25 2021 @ 22:46PM

    ఇటిక్యాల, ఫిబ్రవరి, 25 : ఎర్రవల్లి గ్రామ సమీపంలో 44వ నెంబర్‌ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కడప జిల్లా మైదుకూరుకు చెందిన పటేల్‌, నర్సిం హలు బుధవారం రాత్రి కారులో హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి బయలు దేరారు. గురు వారం తెల్లవారుజామున మూత్రవిసర్జన కోసం ఎర్రవల్లి సమీపంలో కారును రోడ్డుపక్కన ఆపారు. పటేల్‌ కిందికి దిగగా, నర్సింహ కారులో డోరు తెరుచుకొని కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి నంద్యాలకు వెళ్తున్న భారీ వాహనం వెనుక నుంచి కారును ఢీకొట్టింది. దీంతో నర్సింహ కారులోంచి బయటకు పడిపోవడంతో ప్రాణాలు దక్కాయి. లారీ డ్రైవర్‌ ఇర్ఫాన్‌ కూడా ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. 

Follow Us on:
Advertisement