శిరివెళ్ల, డిసెంబరు 2: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై గోవిందపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శిరివెళ్లకు చెందిన మహమ్మద్ రఫి తీవ్రంగా గాయపడ్డాడని ఎస్ఐ సూర్యమౌలి బుధవారం తెలిపారు. మహమ్మద్ రఫి నంద్యాలలో గౌండా పని ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుండగా కారు అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన బోరెడ్డి నాగేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.