రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

ABN , First Publish Date - 2021-07-25T05:40:37+05:30 IST

ఉలవపాడు జాతీయ రహదారి మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అందులో ఓ వ్యక్తి ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయింది. జాతీయ రహదారి పోలీసులు అందించిన వివరాలు ప్రకారం.. ఒంగోలులోని రంగారాయుడు చెరువు శివాలయంలో వేమూరి హరి అర్చకుడిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉలవపాడు గ్రామానికి తన మోపెడ్‌పై వెంకాయమ్మ అనే మహిళతో వస్తున్నాడు.

రోడ్డు ప్రమాదంలో  ఇద్దరికి గాయాలు
రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులు

ఉలవపాడు, జూలై 24 : ఉలవపాడు జాతీయ రహదారి మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో  ఇద్దరికి గాయాలయ్యాయి.  అందులో  ఓ వ్యక్తి ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయింది. జాతీయ రహదారి పోలీసులు అందించిన వివరాలు ప్రకారం.. ఒంగోలులోని రంగారాయుడు చెరువు శివాలయంలో వేమూరి హరి అర్చకుడిగా పనిచేస్తున్నాడు. శనివారం ఉలవపాడు గ్రామానికి తన మోపెడ్‌పై వెంకాయమ్మ అనే మహిళతో వస్తున్నాడు. మన్నేటికోట గ్రామం నుంచి ఉలవపాడుకు వెళ్లే క్రమంలో మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద కావలి వైపు వెళ్లే కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. వాహనచోదకుడు హరి ఎడమ కాలు మోకాలు కిందకు విరిగింది. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మహిళకు స్వల్పగాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ఇద్దరిని 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ప్రమా దానికి కారణమైన కారు విజయవాడకు  చెందిన జిల్లా స్థాయి ప్రభుత్వ అధికారిదిగా చెప్తున్నారు.

 

Updated Date - 2021-07-25T05:40:37+05:30 IST