కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి రోడ్డు నిర్మాణం

ABN , First Publish Date - 2022-09-30T06:16:16+05:30 IST

పట్టణంలో రేణుక పరమేశ్వరీ ఆలయం వద్ద తనకు చెందిన 3 సెంట్ల స్థలంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని

కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి రోడ్డు నిర్మాణం
స్థలాన్ని చదును చేస్తున్న మునిసిపల్‌ సిబ్బంది

 మాజీ కౌన్సిలర్‌ ఆరోపణ 

 దసరా ఉత్సవాల కోసమే అంటున్న కమిషనర్‌

జగ్గయ్యపేట, సెప్టెంబరు 29: పట్టణంలో రేణుక పరమేశ్వరీ ఆలయం వద్ద  తనకు చెందిన 3 సెంట్ల స్థలంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని మునిసిపల్‌ కమిషనర్‌పై మాజీ కౌన్సిలర్‌ తాళ్లూరి  సోమయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తల్లి నుంచి సంక్రమించిన భూమిలో మునిసిపాలిటీ గతంలో రోడ్డు నిర్మాణం చేపట్టగా  హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, బలవంతంగా రోడ్డు వేయవద్దని కోర్టు తీర్పునిచ్చిందని సోమయ్య అన్నారు. తన భూమిలో  కమిషనర్‌ యంత్రాలతో శుభ్రం చేయిస్తున్నాడని, కోర్టు ధిక్కారణకింద  కోర్టును ఆశ్రయిస్తున్నట్టు సోమయ్య చెప్పారు. దీనిపై  కమిషనర్‌ను వివరణ కోరగా దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా శుభ్రం చేయించామని, రోడ్డు కోసం కాదన్నారు. 


Updated Date - 2022-09-30T06:16:16+05:30 IST